Razole: కోనసీమ గంజాయి బ్యాచ్‌లకు ఎస్పీ షాక్.. స్పాట్‌లోనే రాపిడ్ టెస్టులు.. 10 మంది దొరికేసారు!

Razole: గంజాయి మహమ్మారిపై కోనసీమ జిల్లా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. రాజోలులో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 21 May 2026 10:45 AM IST
Razole
X

 Razole: కోనసీమ గంజాయి బ్యాచ్‌లకు ఎస్పీ షాక్.. స్పాట్‌లోనే రాపిడ్ టెస్టులు.. 10 మంది దొరికేసారు!

రాజోలు (కోనసీమ జిల్లా): గంజాయి బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని డాక్టర్..బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కోరారు. రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గంజాయి వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టిందన్నారు. మత్తుకు బానిసలైన యువతకు, గంజాయి బ్యాచ్ లలో మార్పు తీసుకొచ్చేందుకు జిల్లాలో మొదటి సారిగా రాజోలు పోలీస్ సర్కిల్ పరిధిలోని పాత గంజాయి బ్యాచ్ మరియు పలు గ్రామాల పెద్దలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... యువకులు లక్ష్యాలను నిర్దేశించికుని తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. గతంలో మాదిరిగా కాకుండా గంజాయి సేవించిన వారికి నూతనంగా ప్రవేశపెట్టిన రాపిడ్ కిట్ల ద్వారా యూరిన్ పరీక్షలు నిర్వహించి వెంటనే గుర్తించడం జరుగుతుంది అన్నారు.తొలిసారిగా జిల్లాలో రాజోలు నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసై దూరంగా ఉండాలని అనుకుంటే పోలీసుల సహాయంతో జిల్లా కేంద్రంలో డీ అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అన్నారు.ఈ రోజు దాదాపు యాభై మంది పాత గంజాయి బ్యాచ్ కు రాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా 10 మందికి పైగా పాజిటివ్ వచ్చిందన్నారు.వీరందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, లేదు ఇలాగే కొనసాగుతామంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రాజోలు సీఐ వి.సురేష్ బాబు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story