ACB Raids: కనిగిరి ఆర్డీవో ఆఫీసులో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్!
ACB Raids: కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
ACB Raids: కనిగిరి ఆర్డీవో ఆఫీసులో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్!
ACB Raids: మార్కాపురం జిల్లా కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చుండి పృథ్వీరాజ్ అనే డిప్యూటీ తహసీల్దార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అధికారులు. భూ విభజన సబ్‌డివిజన్ ఫైలు పరిష్కారం కోసం 25 వేల లంచం డిమాండ్ చేసిన ఆయన... ఫిర్యాదుదారు వేపుల వెంకటేశ్వర్లు నుంచి లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు ఒంగోలు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో వల పన్ని అవినీతి అధికారిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా లంచం తీసుకుంటున్న సమయంలోనే నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు తదుపరి విచారణ అనంతరం నెల్లూరులోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.




