Kanchikacherla: నక్కలంపేటలో భారీ దొంగతనం: అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న పోలీసులు

Kanchikacherla: రూ. 52 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం.. సాంకేతిక పరిజ్ఞానంతో కేసు ఛేదించిన ఏసీపీ శ్రీనివాస్

Naresh, Nandigama
Published on: 17 Jun 2026 5:52 PM IST
Kanchikacherla
X

Kanchikacherla: నక్కలంపేటలో భారీ దొంగతనం: అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న పోలీసులు

Kanchikacherla: కంచికచర్ల మండలం నక్కలంపేట గ్రామంలో దొంగతనలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న కంచికచర్ల పోలీసులు....

ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర దొంగలను మీడియా ముందుఉంచారు...

ఏ.సీ.పి మాట్లాడుతూ నక్కలంపేట గ్రామానికి చెందిన గుత్తా పుల్లారావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 52 లక్షల ఖరీదు చేసే 374 గ్రాములు బంగారం 50వేల నగదును దొంగిలించారని ఈ ఘటనపై కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసుని ఛేదించామని ఏసీపి పేర్కొన్నారు ...

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన అంతర్రాష్ట్ర నలుగురు దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 374 గ్రాముల బంగారాన్ని నగదుని స్వాధీనం చేసుకొని నేరస్తుల్ని కోర్టుకు హాజరు పరుస్తు న్న ట్లు ఏ.సి.పి శ్రీనివాస్ తెలిపారు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story