Mamidikuduru: మామిడికుదురులో 'ఇమామ్ హుస్సేన్ వాక్'.. పోటెత్తిన భక్తజనం!

Mamidikuduru: మామిడికుదురులో హజరత్ ఇమామ్ హుస్సేన్ అమరత్వాన్ని స్మరిస్తూ నిర్వహించిన 'ఇమామ్ హుస్సేన్ వాక్' ఘనంగా జరిగింది.

PRABHU, RAZOLE
Published on: 27 July 2026 11:10 AM IST
Mamidikuduru
X

Mamidikuduru: మామిడికుదురులో 'ఇమామ్ హుస్సేన్ వాక్'.. పోటెత్తిన భక్తజనం!

మామిడికుదురు: హజరత్ ఇమామ్ హుస్సేన్ అమరత్వాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన "ఇమామ్ హుస్సేన్ వాక్" కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఆదివారం రాత్రి నగరం లోని పెద్ద పంజేష నుంచి పాశర్లపూడి బీబీ ఫాతిమా దర్గా వరకు నిర్వహించిన వాక్‌లో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ప్రక్క జిల్లాల నుంచి కూడా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ముస్లిం చరిత్రలో ధర్మం, మానవత్వం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన హజరత్ ఇమామ్ హుస్సేన్‌ను స్మరించుకునే వాక్‌లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

వాక్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ భీమరాజు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించి, దారిపొడవునా ట్రాఫిక్‌ను నియంత్రించారు.

ఖాసిం మొహమ్మద్ రజ్వీ ఆధ్వర్యంలో "అంజుమనే ఘాజీ" మరియు "అంజుమనే పర్వానయే హుస్సేన్" సంఘాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించి, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు కల్పించాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story