Nidadavole: ప్రమాదకరంగా కేబుల్ వైర్లు.. బెంబేలెత్తుతున్న వాహనదారులు!

Nidadavole: నిడదవోలు ప్రధాన రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్ వైర్లు. వాహనదారులకు తప్పని ఇబ్బందులు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 10 Jun 2026 12:28 PM IST
Nidadavole
X

Nidadavole: ప్రమాదకరంగా కేబుల్ వైర్లు.. బెంబేలెత్తుతున్న వాహనదారులు!

తూర్పుగోదావరి జిల్లా: నిడదవోలు మండలం నిడదవోలు పట్టణ పరిధిలో నిడదవోలు నుంచి సుబ్బరాజుపేట సింగవరం వెళ్లే ప్రధాన రోడ్ లో కేబుల్ వైర్లు వేలాడుతూ వాహనాలకు అడ్డుపడుతూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.

తాడేపల్లిగూడెం వెళ్లేందుకు ఈ రోడ్డు ఉపయోగాలు ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది దీంతో పక్కకు వెళుతుంటే రోడ్డు మార్జిన్ లో కేబుల్ వైర్లు తగులుతుండటంతో.. ప్రమాదంలో జరిగే అవకాశం ఉందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది కేబుల్ టీవీ కి పత్తాసు పలుకుతున్నారా? అనే సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే వీటిపై దృష్టి పెట్టాలని వారు కోరుకుంటున్నారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

Next Story