Rajahmundry: వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే వేడుకలు
Rajahmundry: దివాన్ చెరువులో వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు జరిగాయి.
Rajahmundry: వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే వేడుకలు
Rajahmundry: మహాత్మ పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రజల అభ్యున్నతి కోసం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన సాగించారని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం దివాన్ చెరువు గ్రామంలోని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో శనివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జడ్పిటిసి బీసీ సంఘం నాయకులు వాసంశెట్టి పెద్ద జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ..
మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో అణగారిన వర్గాల విద్య, సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు అన్నారు. ఆయన చూపిన మార్గం ఇప్పటికీ సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. నేటి రాజకీయాల్లో కూడా పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఫూలే ఆలోచనలు గుర్తుకు వస్తాయన్నారు.
సమాజంలో నిజమైన అభివృద్ధి అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే అని ఆయన సందేశం ఇప్పటికీ ప్రాసంగికమే అన్నారు. సమాజంలో అందరికీ విద్యా అందాలని ఆ రోజుల్లో ఆయన సతీమణి సావిత్రిబాయి, పూలే కృషి చేశారన్నారు. పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో పాలన సాగించిన నేత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.
వైఎస్ఆర్సిపి జిల్లా బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు జడ్పిటిసి వాసంశెట్టి పెద్దా మాట్లాడుతూ మహాత్మా పూలే సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్గాల శ్రీనివాస్, పలివెల స్వామి, కొల్లేపల్లి వీరభద్రరావు, నేలపాల శివరామకృష్ణ, అంకం దొరబాబు, చిటికెన తరుణ్ వివిధ నాయకులు పాల్గొన్నారు.




