Gajwel: తొలి జీతం.. రైతు కుటుంబాలకు అండగా!

Gajwel: గజ్వేల్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మనస్వి తన మొదటి జీతాన్ని ఆత్మహత్య చేసుకున్న ఐదు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందజేసి మానవత్వం చాటుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 April 2026 5:17 PM IST
Gajwel
X

Gajwel: తొలి జీతం.. రైతు కుటుంబాలకు అండగా!

Gajwel: తండ్రి చేసే సామాజిక కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి అవుతూ అందరితో శభాష్ అనిపించుకుంటుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం సాధించిన యువతి తన మొదటి నెల వేతనాన్ని ఆత్మహత్య చేసుకున్న 5 రైతు కుటుంబాలకు అందించి అందరి మన్ననలు పొందుతుంది మనస్వి. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన పులి రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.

గత 26 సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలపై అధ్యయనం చేస్తూ ఆ కుటుంబాలకు దాతల సహకారంతో ఆర్థిక సహాయంతో పాటు పిల్లలకు విద్య అందించడానికి కృషి చేస్తున్నాడు. తండ్రి సామాజిక సేవను గమనిస్తూ వచ్చిన పులిరాజు కూతురు పులి మనస్వి ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేసి యాక్సెంచరి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించారు.

ఈ నెల 10వ తేదీన మొదటి వేతనం పొందిన మనస్వి తనకు వచ్చిన డబ్బులు మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఐదు రైతు కుటుంబాలకు అందజేశారు ఒక్కొక్కరికి ఐదువేల నగదు తో పాటు ఒక చీరను అందించారు.

కుటుంబాల పేర్లు:

1. కుమ్మరి స్వామి భార్య రేణుక ఎల్కల్ గ్రామం,

2. చింతకింది అనూష గ్రామం వేలూరు మండలం వర్గల్

3. కొండి మానస గ్రామo ఏటిగడ్డ కిష్టాపూర్ RR కాలనీ,

4. తొర్రి రేణుక ఎల్కల్ గ్రామం

5. గుడిసె కల్యాణి జాలిగామ గ్రామం.

చిన్నతనంలోనే రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చూపించిన మనస్విని పలువురు అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story