YS Jagan: ఉక్కు కార్మికులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు.. జగన్ సంచలన వ్యాఖ్యలు!

YS Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

Arun Chilukuri
Published on: 10 Jun 2026 2:46 PM IST
YS Jagan: ఉక్కు కార్మికులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు.. జగన్ సంచలన వ్యాఖ్యలు!
X

YS Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదఘటనలో తొమ్మిది మంది కార్మికులు చనిపోవడం బాధాకరమన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. ప్రమాదంలో గాయపడి సెవన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, మరణించిన వారి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి.. ఓదార్చారు. కార్మిక సంఘాల నేతలతో జగన్ మాట్లాడారు. స్యీల్ ప్లాంట్ పరిస్థితులపై ఆరా తీశారు.

ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఉక్కు కార్మికుల పరిస్తితిపై అందరూ ఆలోచన చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాననవత్వంతో ప్రవర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను తొలగిస్తున్నారని.. క్వార్టర్స్ వదిలి ఉద్యోగులు వెళ్ళిపోయే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు బోనస్, మెడికల్ ఫెసిలిటీ ఏమీ లేకుండా పోయాయన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story