Nellore: సిటీలో పన్నుల వేధింపులు.. కుళాయి లేకున్నా ట్యాక్సా?
Nellore: నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో భారీ అవినీతి జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
Nellore: సిటీలో పన్నుల వేధింపులు.. కుళాయి లేకున్నా ట్యాక్సా?
Nellore: అమరావతి తరహాలోనే నెల్లూరు సిటీలో అవినీతి జరుగుతుందని తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ఇంటి పన్నులు, కుళాయి పన్నులు కట్టలేదని నిరుపేదలకు నోటీసులు పంపుతున్నారని, కుళాయి లేని వారికి కూడా పన్ను వేయడం అత్యంత దారుణం అని అన్నారు. మొక్కల పెంపకం పేరుతో మంత్రి నారాయణ భారీ దోపిడికి పాల్పడుతున్నారంటూ విమర్శించారు.
750 రూపాయలు విలువ చేసే మొక్కకు. 12 వేలు ఖర్చు చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఫోటోలు చూపిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి నారాయణ అనుచరులు ప్రజా ధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..నగర కమీషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అధికారం శాశ్వతం కాదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు మాజీ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.




