Seediri Appalaraju: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు!
Seediri Appalaraju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రోడ్డు ప్రమాద కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలతో 24 రోజులుగా సబ్ జైలులో ఉన్నారు.
Seediri Appalaraju: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు!
Seediri Appalaraju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో ఆయనకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూలై 10న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సాక్షాధారాలను తారుమారు చేశారనే అభియోగాలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
రోడ్డు ప్రమాద కేసు దర్యాప్తులో భాగంగా జూలై 22న పోలీసులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో గత 24 రోజులుగా ఆయన శ్రీకాకుళం జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన సోంపేట కోర్టు, శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ రావడంతో ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.
Next Story




