Vizianagaram: బొబ్బిలి అభివృద్ధికి సీఎం హామీ.. పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్యే బేబీనాయన!
Vizianagaram: విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో సమీక్ష నిర్వహించారు.
Vizianagaram: బొబ్బిలి అభివృద్ధికి సీఎం హామీ.. పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్యే బేబీనాయన!
బొబ్బిలి/అమరావతి: అమరావతిలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు నిన్న సాయంత్రం విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు, సాగునీటి వనరుల నిర్వహణ మరియు జిల్లా అభివృద్ధి ప్రతిపాదనలపై అందరు ఎమ్మెల్యే లతో చర్చించారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో ఆర్ధిక భారం లేని మూడు సమస్యలు మరియు నిధులతో ముడిపడిన మూడు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
సాగునీటి ప్రాజెక్టుల మరమ్మత్తులు, శిథిలావస్థకు చేరిన ప్రాజెక్టుల పై అరా తీశారు. బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన శాసనసభ్యులు బేబినాయన వాటిలో ప్రధానంగా పారాది కొత్త వంతెన మరియు దాని అనుసంధాన రోడ్డు కోసం అంచనావ్యయం పెరగడంతో అదనపు నిధులు లోచర్ల - శివడవలస ఎత్తిపోతల పథకానికి నిధులు.గొల్లాది వంతెన నిర్మాణానికి నిధులు.
బొబ్బిలి పట్టణ రోడ్లు అభివృద్ధికి నిధులు.అనంతరం, తమ తండ్రి ఆర్.వీ.జి.కె.రంగారావు (కుమార్ రాజా)1961వ సంవత్సరంలో రికార్డు స్థాయిలో చెరకు పంటను పండించిన ఫోటోను ముఖ్యమంత్రి కి బహుకరించారు.
ఎమ్మెల్యే బేబీనాయన పనితీరు బావుందని ఇంకా మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు.ఈ సమావేశం ద్వారా పెండింగులో ఉన్న పనులకు ముఖ్యమైన ప్రాజెక్టులకు ఊరట లభించే అవకాశం ఉందని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.


