Atmakur: కాలువ గట్టున చికెన్ దుకాణం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!
Atmakur: సంగం మండలం అన్నారెడ్డి పాలెంలో సదరన్ ఛానల్ కాలువ గట్టుపై వెలిసిన చికెన్ షాపు వ్యర్థాల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
Atmakur: కాలువ గట్టున చికెన్ దుకాణం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!
Atmakur: సంగం మండలంలోని అన్నారెడ్డి పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని సదరన్ ఛానల్ కాలువ గట్టుపై ఏర్పాటు చేసిన ఉన్న చికెన్ షాపును వెంటనే అక్కడ నుండి తొలగించాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు యీ ల ఉన్నాయి. చికెను అంగడికి సంబంధించిన వ్యర్థాలు.
చికెన్ వేస్ట్ కు సంబంధించిన వ్యర్ధాలు అన్ని కూడా ఈ చదరన్ ఛానల్లో కలపటం జరుగుతుందని స్థానికులు తెలిపారు. ఈ చదరన్ చానల్లో కాలువకు సంబంధించి వేలాది ఎకరాల ఆయకట్టుకు జీవనాధారం అని తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని మూగజీవాలన్నీటి కూడా వేసవి సమయంలో ఈ కాలములోనే దాహతా తీర్చేందుకు ఉపయోగపడుతుందని,
స్థానికులు తెలిపారు. ఇలాంటి సమయంలో చికెన్ వ్యర్థాల వల్ల ప్రజలు కూడా అనేక రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్ లో స్థానికులు దరఖాస్తు చేస్తామని సమాచారం తెలుపుతున్నారు. ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ చికెన్ షాపును అక్కడ నుండి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.




