Abdul Aziz: ‘ఉచిత విద్య’ కోసం రొట్టెలు మార్చుకున్న విద్యార్థులు!

Abdul Aziz: నెల్లూరు రొట్టెల పండుగలో విద్యార్థులు 'ఉచిత విద్య' కోసం రొట్టె వదిలారు. ఈ రొట్టెను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ విద్యార్థులను అభినందించారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Jun 2026 11:57 AM IST
Abdul Aziz:
X

Abdul Aziz: ‘ఉచిత విద్య’ కోసం రొట్టెలు మార్చుకున్న విద్యార్థులు!

Abdul Aziz: తమలాగే అనేక మందికి ఉచిత విద్య అందాలని కోరుకుని , అబ్దుల్ అజీజ్ కు విద్యార్థులు రొట్టె అందించారు. ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో తాలిం ఏ హునర్ పేరుతో ట్యాలెంట్ టెస్ట్ నిర్వహించి 250 మంది పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ట్యాలెంట్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమలాగే ఎంతో మందికి ఉచిత కార్పొరేట్ విద్య అందాలని కోరుకుంటూ రొట్టె వదిలారు. ఆ రొట్టె ను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అందుకున్నారు.

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ....

గత సంవత్సరానికి మించి ఈ సంవత్సరం 20 లక్షల మంది భక్తులు విచ్చేశారని, వారికి సౌకర్యాలు కల్పన సరిగా జరిగిందా లేదా అన్న ఆందోళన ఉందన్నారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యంతో తాలీం ఏ హునర్ పేరుతో ట్యాలెంట్ టెస్ట్ నిర్వహించి, కార్పొరేట్ విద్య ను అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత మందికి విద్య అందించాలని కోరుకుంటూ విద్య రొట్టె పట్టుకున్నామని అన్నారు.

విద్య రొట్టెను అందరికీ పంచిపెట్టామని అన్నారు. ఇదే విద్యార్థులను డాక్టర్ లుగా ఇంజినీర్ లుగా చేసి తీసుకువస్తానని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, ఫరూక్ ల ఆశీర్వాదంతో కార్యక్రమం విజయవంతం అయిందని అన్నారు.

విద్యార్థి అంజుం మాట్లాడుతూ, పరీక్ష లో సెలెక్ట్ అయ్యి నేను కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నాను. అక్కడ చదవాలంటే అదృష్టం ఉండాలని, అంతటి అదృష్టం ప్రసాదించిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, ఫరూక్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, కరిముల్లా, సమీ హుస్సేనీ, సాబీర్ ఖాన్, హయత్ బాబా, ఇంతియాజ్, పాషా మొహిద్దిన్, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story