Pemmasani Chandrasekhar: ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Pemmasani Chandrasekhar: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ఇళ్లు కేటాయించింది.
Pemmasani Chandrasekhar: ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Pemmasani Chandrasekhar: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా భారీగా ఇళ్లు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల చొప్పున మొత్తం 5 లక్షల ఇళ్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన కేటాయింపులతో పోలిస్తే, ఏపీకి అదనంగా 2.25 లక్షలు, తెలంగాణకు 1.25 లక్షల ఇళ్లు అదనంగా మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఈ స్థాయిలో ఇళ్లు కేటాయించడం ఇదే మొదటిసాని తెలిపారు.
2019-24 మధ్య కాలంలో ఏపీకి 1.78 లక్షల ఇళ్లు కేటాయిస్తే కేవలం 42 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని, ఆ కాలంలో తెలంగాణ ‘గ్రామీణ ఆవాస యోజన’ పథకంలో చేరలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి ఇళ్ల కేటాయింపు కోసం విజ్ఞప్తి చేయడంతో, అడిగిన దానికంటే ఎక్కువే మంజూరు చేశామని తెలిపారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం తరఫున రూ.1.20 లక్షల ప్రాథమిక ఆర్థిక సాయం అందనుండగా, అదనపు సాయంతో లబ్ధిదారులకు దాదాపు రూ.1.80 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు అందజేస్తారు.
ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని, సెల్ఫ్ సర్వే సదుపాయం కల్పించామన్నారు. అలాగే ఆదాయ అర్హత పరిమితిని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచామని, మోటార్ బైక్ లేదా ఫ్రిజ్ ఉన్నప్పటికీ అర్హత కోల్పోకుండా నిబంధనల్లో సవరణలు చేసినట్లు తెలిపారు.
పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్ల కేటాయింపు జరగనుందని, కొత్త మరియు పాత ఇళ్ల నిర్మాణాలన్నీ రాబోయే 2-3 ఏళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు.




