Bhanu Prakash Reddy: కొండా సురేఖ ‘శూర్పణఖ’లా మాట్లాడుతున్నారు
Bhanu Prakash Reddy: శ్రీరాముడిపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆమెను శూర్పణఖతో పోల్చిన ఆయన, వెంటనే దేవాదాయ శాఖ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Bhanu Prakash Reddy: కొండా సురేఖ ‘శూర్పణఖ’లా మాట్లాడుతున్నారు
Bhanu Prakash Reddy: మంత్రి కొండా సురేఖపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొండా సురేఖ రాముడి గురాంచి శూర్పణఖలా మాట్లాడారని అన్నారు. దేవాదాయశాఖకు సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల దేవుళ్లపై కించపరుస్తూ మాట్లాడిన మమతా బెనర్జీ ,స్టాలిన్, కమ్యూనిస్టు పార్టీలు తాజా ఎన్నికల్లో ఓడిపోయారన్నారు.
దేశంలో ఇక మిగిలింది ఆరు రాష్ట్రాలే అని...త్వరలో తెలంగాణలోనూ కాషాయజెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మున్ముందు దేశమంతా కాషాయమయం కాబోతోందన్నారు. వెంటనే హిందువులకు కొండ సురేఖ క్షమాపణ చెప్పాలన్నారు భానుప్రకాష్.
Next Story




