Nellore: కలువాయిలో టైలరింగ్ శిక్షణ పూర్తి.. మహిళలకు పరీక్షలు

Nellore: నెల్లూరు జిల్లా కలువాయిలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 62 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 April 2026 2:13 PM IST
Nellore
X

BC Corporation Tailoring Training Exam in Kaluvaya

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్ శిక్షణ పూర్తయిన మహిళలకు పరీక్ష నిర్వహించారు,ఈ సందర్బంగా స్కిల్ డెవలప్మెంట్ ఎగ్జామర్ గోపాల రంగయ్య మాట్లాడుతూ శిక్షణ పూర్తయిన మహిళలకు త్వరలో కుట్టు మిషన్ లు అందజేస్తామని తెలిపారు, శిక్షణ పొందిన 62 మంది సభ్యులకు నేడు పరీక్షలు నిర్వహించామని,

మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహించగా, అందులో 60 శాతం మార్కులు సాధించిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన వారికి త్వరలోనే కుట్టు యంత్రాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశాలు పెరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్లు అరుణ, వరలక్ష్మి, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story