AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. కొత్త పెన్షన్లు, భూ కేటాయింపులపై కీలక నిర్ణయాలు!
AP Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. కొత్త పెన్షన్లు, భూ కేటాయింపులు మరియు రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. కొత్త పెన్షన్లు, భూ కేటాయింపులపై కీలక నిర్ణయాలు!
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేయాల్సిన పెన్షన్ల ప్రక్రియ, అర్హుల ఎంపికపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమల స్థాపన, పలు సంస్థలకు అవసరమైన భూ కేటాయింపుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రభుత్వం త్వరలోనే రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను ఎలా తీసుకెళ్లాలనే అంశంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
అజెండా ముగిసిన తర్వాత రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ సరఫరా సమస్యలపై సమీక్ష జరపనున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే దానిపై వ్యూహరచన చేయనున్నారు. కొంతమంది మంత్రుల సింగపూర్ పర్యటన తాలూకు వివరాలు, అక్కడ జరిగిన చర్చల గురించి కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.




