Weather Report: ఏపీకి వాతావరణ శాఖ ‘రెయిన్ అలర్ట్’.. రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!
Weather Report: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది.
Weather Report: ఏపీకి వాతావరణ శాఖ ‘రెయిన్ అలర్ట్’.. రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!
Weather Report: ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో వాతావరణ వ్యవస్థల్లో ఏర్పడిన మార్పుల కారణంగా రాబోయే మూడు రోజుల పాటు ఏపీవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ప్రస్తుతం వాయువ్య ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు ఉత్తర జార్ఖండ్ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఏపీ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడటంతో పాటు వర్షాలు కురవనున్నాయి.
ప్రాంతాల వారీగా వాతావరణ సూచన (Weather Forecast)
తగ్గనున్న ఉష్ణోగ్రతలు – ఈదురుగాలుల హెచ్చరిక:
రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ.. ఆ తర్వాత రోజుల్లో ఎండ తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, వర్షం కురిసే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఎవరూ ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు.
నైరుతి రుతుపవనాల అప్‌డేట్: అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు (Monsoon) వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఇవి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.




