Chandrababu: అమరావతి రైతులది త్యాగం కాదు స్ఫూర్తి.. స్టీల్ బ్రిడ్జీలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
Chandrababu: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన అమరావతి రైతులది కేవలం త్యాగమే కాదని, దేశానికే గొప్ప స్ఫూర్తి అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు.
Chandrababu: అమరావతి రైతులది త్యాగం కాదు స్ఫూర్తి.. స్టీల్ బ్రిడ్జీలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
Chandrababu: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన అమరావతి రైతులది కేవలం త్యాగమే కాదని, దేశానికే గొప్ప స్ఫూర్తి అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజధాని అమరావతిని అనుసంధానించే అత్యంత కీలకమైన ప్రధాన రహదారి ‘సీడ్ యాక్సెస్ రోడ్డు’ (E-3)తో పాటు దానికి అనుసంధానంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జీలను సీఎం గురువారం ప్రారంభించారు.
ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం చంద్రబాబు కాలినడకన వెళ్లి స్టీల్ బ్రిడ్జిల నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం స్థానికులు, రైతులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర విభజన తర్వాత భవిష్యత్తు ఏమవుతుందో తెలియని క్లిష్ట పరిస్థితి నెలకొందని, రాజధాని ఎక్కడ నిర్మించాలో అర్థం కాని వేళ శివరామకృష్ణన్ కమిటీ వేశామని సీఎం గుర్తుచేసుకున్నారు. మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతినే రాజధానిగా ఎంపిక చేశామని తెలిపారు.
మహానగర నిర్మాణానికి భూములు సేకరించడం పెద్ద సవాలుగా మారిన వేళ, రైతులను భాగస్వాములను చేస్తూ 'ల్యాండ్ పూలింగ్' విధానాన్ని తెరపైకి తెచ్చామని పేర్కొన్నారు.
తనపై ఉంచిన నమ్మకంతో పిలుపునిచ్చిన 58 రోజుల్లోనే 29 వేల మంది రైతులు ముందడుగు వేసి 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారని సీఎం వివరించారు. ఈ సందర్భంగా అమరావతి రైతాంగానికి సీఎం చంద్రబాబు శిరస్సు వంచి పాదాభివందనం చేశారు.
ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఉండి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం ప్రవీణ్ (రామకృష్ణ) మరియు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.




