Hindupuram: అనాథ శవానికి అంత్యక్రియలు.. ట్రస్ట్ సభ్యుల ఉదారత
Hindupuram: హిందూపురంలో మానవత్వం వెలుగు చూసింది. రైల్వే స్టేషన్ సమీపంలో మృతి చెందిన 65 ఏళ్ల అనాథ వ్యక్తికి అల్ ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.
Hindupuram: అనాథ శవానికి అంత్యక్రియలు.. ట్రస్ట్ సభ్యుల ఉదారత
Hindupuram: స్థానికంగా గురువారం జరిగిన ఒక విషాద ఘటన మానవత్వాన్ని మరోసారి గుర్తు చేసింది. రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 65 సంవత్సరాల వయస్సు గల ఓ అనాధ వ్యక్తి మృతి చెందగా ఆయనకు ఎలాంటి కుటుంబ సభ్యులు లేకపోవడం హృదయ విదారకంగా మారింది.ఈ విషయాన్ని తెలుసుకున్న రెండో పట్టణ సీఐ కరీం సార్, వెంటనే అల్ ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ ఎం డి ఎస్ అమన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎండీఎస్ అమన్ సభ్యులు ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకుని, ఎవరూ లేని ఆ అనాధను తమ కుటుంబ సభ్యుడిగా భావించి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలాజీ నాయక్ సార్ , కానిస్టేబుల్ నాగరాజు గారి సహకారం కీలకంగా నిలిచింది. వారి మార్గదర్శకత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అనాధకు చివరి వీడ్కోలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు మాట్లాడు ఎండిఎస్ ఆమన్ మాట్లాడుతూ సమాజంలో మానవత్వం దయ ప్రతి ఒక్కరిలో ఉండాలని అనాధలకు అండగా నిలబడటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.అనాధగా జీవించి ఒంటరిగా మృతి చెందిన ఆ వ్యక్తికి అల్ ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చూపిన మానవత్వం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ఈ ఘటన సమాజంలో మానవత్వం ఇంకా సజీవంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు ట్రస్ట్ అధ్యక్షుడు ఎం. డి.ఎస్ అమన్, ట్రస్ట్ క్యాషియర్ అరఫాత్, బ్లడ్ ప్రెసిడెంట్ సాదిక్, రెహ్మాన్, అంబులెన్స్ రమణ, హుజైఫ్ తదితరులు పాల్గొన్నారు




