ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
Vontimitta Sitarama Kalyanam: ఒంటిమిట్టలో కనులపండువగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు.
ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
Vontimitta Sitarama Kalyanam: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవ కార్యక్రమాన్ని కనులపండువగా జరిగింది. సీఎం చంద్రబాబు దంపతులు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణమహోత్సవం తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణానికి ముందు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. తెలుగువారి పెళ్లి సంప్రదాయాలను ఈ ఉత్సవం ఎంతో భక్తిశ్రద్దలతో వీక్షించారు.
రాష్ట్ర ప్రజలందరిపై సీతారాముల ఆశీస్సులు ఉండాలని.. అందరూ సుఖసంతోషాలతో వర్లిల్లాలని కోరుకున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఒంటిమిట్ట వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పారు. ఒంటిమిట్ట క్షేత్రాన్ని కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా.. అంతర్జాతీయ స్తాయి టెంపుల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.




