Vizag: బ్రాహ్మణ సమాజం కోసం కొత్త ట్రస్ట్.. సభ్యత్వానికి పిలుపు

Vizag: బ్రాహ్మణుల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా విశాఖపట్నంలో 'ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్' ఆవిర్భవించింది.

GOPI, PENDURTHI
Published on: 4 April 2026 3:54 PM IST
Vizag
X

Vizag: బ్రాహ్మణ సమాజం కోసం కొత్త ట్రస్ట్.. సభ్యత్వానికి పిలుపు

Vizag: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణుల ఎదుర్కొన్న సమస్యలు వాటి పరిష్కారం, ప్రభుత్వ పథకాలు అందజేయడంలో సహకరించడం, దేవాలయాల్లో అర్చక, పురోహితులు సమస్య ఎదుర్కొంటున్న వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వడం, ట్రస్టు సభ్యులకు సామాజిక భద్రత కల్పించడం, బ్రాహ్మణుల సంఘటితం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపకల్పనతో విశాఖలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ ఆవిర్భావం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ వడ్డాది ఉదయకుమార్ శనివారం మీడియాకు తెలియజేశారు.

ట్రస్ట్ లోగో ఆవిష్కరణ, ట్రస్ట్ విధివిధానాలు త్వరలోనే బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రకటించబడును. బ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి, సామాజిక భద్రత ట్రస్ట్ లక్ష్యంగా పేర్కొన్నారు. బ్రాహ్మణ సమాజానికి చెందిన ప్రతి ఒక్కరు ట్రస్టులో సభ్యులుగాచేరాలని ఉదయకుమార్ విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వడ్డాది ఉదయకుమార్, ట్రస్ట్ చైర్మన్, సుజాతనగర్,విశాఖపట్నం, 8008129309

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story