Mounika Murder Case: మౌనిక హత్య కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు!
Mounika Murder Case: గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Mounika Murder Case: మౌనిక హత్య కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు!
Mounika Murder Case: గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చింతాడ రవీంద్రను పోలీసులు మంగళవారం గాజువాక మూడవ అదనపు చీఫ్ జూనియర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని జైలుకు తరలించారు.
కీలకంగా మారిన సెల్ఫోన్ డేటా:
ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు గాజువాక పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. మౌనిక మరియు నిందితుడు రవీంద్రల సెల్ఫోన్లలోని డేటాను, కాల్ లిస్ట్ మరియు ఛాటింగ్ వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా హత్య వెనుక ఉన్న అసలు కారణాలు మరియు ఈ ఘటనలో మరెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రుల డిమాండ్:
తమ కూతురిని పొట్టనబెట్టుకున్న రవీంద్రను కఠినంగా శిక్షించాలని మౌనిక తండ్రి వేణుగోపాల్ డిమాండ్ చేస్తున్నారు. తన బిడ్డకు న్యాయం చేయాలని రాష్ట్ర హోంమంత్రిని, డిప్యూటీ సీఎంను ఆయన వేడుకున్నారు. కాగా, హత్య జరిగి రెండు రోజులు గడుస్తున్నా, నిందితుడు రవీంద్ర కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అతడిని చూడటానికి రాకపోవడం గమనార్హం.
మరోవైపు, ఈ ఘటన విశాఖ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూడాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.




