Vizag: మాదకద్రవ్యాల రహిత నగరమే లక్ష్యం.. ఎన్సీబీ అధికారులతో సీపీ బాగ్చి భేటీ

Vizag: విశాఖపట్నంలో డ్రగ్స్ నిర్మూలనకు నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రాత బాగ్చి మరియు ఎన్సీబీ అధికారుల కీలక సమావేశం.

ANIL, VIZAG CITY
Published on: 7 April 2026 9:00 PM IST
Vizag
X

Vizag: మాదకద్రవ్యాల రహిత నగరమే లక్ష్యం.. ఎన్సీబీ అధికారులతో సీపీ బాగ్చి భేటీ

Vizag: విశాఖ నగరంలో డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులతో కలిసి నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగినది.

ఈ రోజు సాయంత్రం నగర పోలీసు కమిషనర్ గారి కాన్ఫరెన్స్ హాల్ నందు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB)కు చెందిన అధికారులు మరియు వారి సిబ్బంది, నగర పోలీసు అధికారులు పాల్గొన్న ఈ కో-ఆర్డినేషన్ మీటింగ్ నందు సింతటిక్ డ్రగ్స్, సెమీ సింతటిక్ డ్రగ్స్ యొక్క కింగ్ పిన్స్ అరెస్టుల పై, వాటి ప్రధాన మూలాల గుర్తింపులపై పలు చర్చలు జరిపి, ఉమ్మడిగా తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగినది.

ఈ కార్యక్రమంలో సిపి గారితో పాటుగా నార్కోటిక్ కంట్రోల్ అధికారులు, నగర డి.సి.పి-01, డి.సి.పి-02, ఏ.డి.సి.పి లు, ఏ.సి.పి లు, సీఐ లు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగినది.

ANIL, VIZAG CITY

ANIL, VIZAG CITY

Next Story