Kovur: నేతన్నల జీవితాల్లో చంద్రన్న చేనేత వెలుగులు

Kovur: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇనుమడుగు చేనేత కాలనీలో పర్యటించి "చంద్రన్న చేనేత వెలుగులు" పథకాన్ని ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 April 2026 2:02 PM IST
Kovur
X

Kovur: నేతన్నల జీవితాల్లో చంద్రన్న చేనేత వెలుగులు

Kovur: చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందచేసే "చంద్రన్న చేనేత వెలుగులు" పధకం నేటి నుంచి అమలవుతున్న నేపథ్యంలో. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోవూరు మండలం ఇనుమడుగు గ్రామంలో చేనేత కాలనీని సందర్శించారు. చంద్రన్న చేనేత వెలుగులు పధకంలో భాగంగా నేతన్నలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ కానుక గురించి వివరించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు సంబంధించిన అర్హత పత్రాల పంపిణి చేశారు.

అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ. చేనేత కార్మికులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చంద్రన్న చేనేత వెలుగులు పధకం అమలు చేసిందన్నారు. ఏడాదికి 150 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాపై భారం పడే చంద్రన్న చేనేత వెలుగులు పధకం అమలు ద్వారా, మర మగ్గాలకు నెలకు 18 వందలు చొప్పున ఏడాదికి 21 వేల రూ. 600 వందలు యాడ్ అవుతాయన్నారు.

ప్రతి చేనేత కుటుంబానికి నెలకు రూ. 720 చొప్పున ఏడాదికి 8640 రూపాయలు లబ్ది చేకూరనుందని పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా 93 వేల చేనేత కుటుంబాలకు లబ్ది చేకూరగా, కోవూరు నియోజకవర్గంలో 531 చేనేత కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో సమాజంలోని అన్ని వర్గాలకు ఆర్ధిక ప్రయోజనం చేకూరే పధకాలను అమలు చేయడం పట్ల ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘ నాయకులు, మరియు స్థానిక టిడిపి కూటమి పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story