Pithapuram: పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకోం.. వంగా గీతా హెచ్చరిక!

Pithapuram: పిఠాపురంలో వైసీపీ కోఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పేదల ఇళ్ల స్థలాలను ఇతర నాయకులకు కట్టబెట్టడంపై అధికారులకు వినతిపత్రం అందజేత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 6:09 PM IST
Pithapuram
X

Pithapuram: పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకోం.. వంగా గీతా హెచ్చరిక!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ వంగా గీతావిశ్వనాథ్ ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పేదల ఇళ్ల స్థలాలు మసీదు మాన్యం వేరొక నాయకులకు కట్టబెట్టడంపై ధ్వజమెత్తిన ప్రజా మద్దతుతో మసీదు మాన్యం నుండి మహిళలతో ర్యాలీగా బైదిల్లి పట్టణంలోని పడ కార్యాలయంలో పిడి ఆఫీసర్ శివరామ్ ప్రసాద్కు ప్రజల మద్దతుతో వినతి పత్రం అందజేత.

ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ వంగా గీతావిశ్వనాథ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పేదల ఇళ్ల స్థలాలను వేరొక నాయకులకు బుజ్జగించే పనిగా వారికి దారా దత్తం చేయడం ఎక్కడో కాకినాడలో కట్టే కాలేజీ పిఠాపురంలో కట్టించడం ఎంతవరకు న్యాయం ఏదో మీరు ప్రజలకు చేసే న్యాయమా లేదా అన్యాయమా అన్నదే మీరే సరిచూసుకోవాలని,

అలాగే నర్సింగపురం వేరొక ప్రాంతాల్లో ఇచ్చిన సుమారు 20 ఎకరాల ఇళ్ల స్థలాలను కూడా వేరే వారికి ఇచ్చేయడం సరికాదని ఎప్పటికైనా పిఠాపురంలో ఏం జరుగుతుందో తెలుసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజంగా మీకు తెలిస్తే ఇలా చేయనివ్వరు కాబట్టి ఎప్పటికైనా ప్రజలకు లబ్ధి జరిగే పనులకు శ్రీకారం చుట్టాలి కానీ ఇటువంటి భూములను దారా దత్తం చేయడం సరికాదని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినిడి సుజాత, వైసీపీ మహిళా లీడర్లు, టౌన్ అధ్యక్షులు రావుల మాధవరావు, వైసిపి నాయకుల కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story