Kurnool: వైసీపీ ఎమ్మెల్సీలు ఖబడ్దార్ వహీద్ హుస్సేన్ ఫైర్
Kurnool: అమరావతి బిల్లు నేపథ్యంలో మాజీ మండలి చైర్మన్ అహమ్మద్ షరీఫ్ పై వైసీపీ ఎమ్మెల్సీల దాడిని టీడీపీ మైనారిటీ నేత వహీద్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు.
Kurnool: వైసీపీ ఎమ్మెల్సీలు ఖబడ్దార్ వహీద్ హుస్సేన్ ఫైర్
Kurnool: ఓ వైపు రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్దత కావడంతో సంతోషంగా ఉంటే మైనారిటీ సీనియర్ నేత అహమ్మద్ షరీఫ్ పై వైసీపీ ఎమ్మెల్సీలు చేయి చేసుకోవడం బాధ కలిగిస్తుందని టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకుడు వహీద్ హుస్సేన్ అన్నారు.
సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో మచ్చలేకుండా పనిచేసిన అహమ్మద్ షరీఫ్ ను శాసన మండలి ఛైర్మన్ గా నియమించారని, అమరావతి బిల్లు శాసన మండలిలో ప్రవేశ పెట్టిన సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మెన్ పై దాడికి పాల్పడ్డారని తెలిసి మైనార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నామని ఎవరైతే అహమ్మద్ షరీఫ్ పై దాడి చేశారో జాగ్రత్తగా ఉండాలని మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని వాహిద్ హెచ్చరించారు.
Next Story




