Nellore: ఎన్టీఆర్ ఆశయాలే మా ఊపిరి - కలువాయిలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు!

Nellore: కలువాయి మండల కేంద్రంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 March 2026 12:47 PM IST
Nellore
X

Nellore: ఎన్టీఆర్ ఆశయాలే మా ఊపిరి - కలువాయిలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు!

Nellore: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం చల్లా రఘు రాంరెడ్డి ఆధ్వర్యంలో కలువాయి మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్బంగా మండల పార్టీ కోశాధికారి డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ నందమూరి రామారావు 1982 మార్చి 29న తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆనాడు పార్టీ స్థాపించారని ఈ నాటికి ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారని తెలిపారు, బడుగు బలహీన వర్గాలకోసం అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారని కిలో 2రూపాయలు బియ్యం, జనతా వస్త్రాలు, ఆస్థిలో ఆడబిడ్డలకు సమాన హక్కు లాంటి పథకాల వల్ల ఎందరో పేద ప్రజలు లబ్ది పొందారని అన్నారు, కలువాయి టౌన్ ప్రసిడెంట్ నూటేటి నరసింహులు మాట్లాడుతూ యన్ టి రామారావు సోమశిల జలాశయం పూర్తి ఈ ప్రాంత ప్రజలకు దేవుడు అయ్యాడని తెలిపారు,తెలుగుగంగ పథకం పెట్టి మెట్ట ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారని అన్నారు, ఈ కార్యక్రమం లో ఏ యం సి వైస్ చైర్మన్ కిషోర్ రెడ్డి, దక్షిణ కాలువ వైస్ ప్రసిడెంట్ చల్లా భాస్కర్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story