Atmakur: ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన.. ఆత్మకూరులో టీడీపీ సంబరాలు
Atmakur: ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు.
Atmakur: ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన.. ఆత్మకూరులో టీడీపీ సంబరాలు
Atmakur: ఆత్మకూరులో టీడీపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద నూతన ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు శంకు స్థాపన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీకి కృషి చేసిన సీనియర్ నేతలను సన్మానించారు. మంత్రి ఆనం మాట్లాడుతూ తెలుగువారి అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలతో టీడీపి 44 వసంతాలు పూర్తి చేసుకుందని తెలిపారు. కూటని ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గం దిన దిన అభివృద్ధి చెందుతుందని అన్నారు.
Next Story




