Pattikonda: పత్తికొండలో గ్రాండ్‌గా టీడీపీ ఫౌండేషన్ డే
Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Pattikonda: పత్తికొండలో గ్రాండ్‌గా టీడీపీ ఫౌండేషన్ డే
Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండ లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించిన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్. ముందుగా స్థానిక మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళి అర్పించడమైనది అనంతరం స్థానిక సుంకంగేట్, తెరుబజార్ నందు పార్టీ జెండాను ఎగరవేయడం మైంది.
పత్తికొండ పట్టణం తేరుబజార్ వేదిక నందు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ. కే.ఈ.శ్యామ్ కుమార్ ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్ గర్జించిన రోజు ఈ రోజు. దేశ రాజకీయాలపై ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను మరియు పార్టీలో ప్రతిభ కనపరిచిన కార్యకర్తలను సత్కరించారు
దేశంలో క్రమశిక్షణ అంకితభావం కలిగిన శ్రేణులు తెలుగుదేశం పార్టీ సొంతం, ఐకమత్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెడదాం.స్థానిక సంస్థాగత ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ
100 రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ కల్పించారు గత ప్రభుత్వంలో రాజధాని ఎక్కడ అంటే పేరు చెప్పే పరిస్థితి కూడా లేదు మార్చి 29 అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. - మార్చి 29 అంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మాత్రమే కాదు.
తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పడానికి పునాది పడిన రోజు కూడా! నాలుగు దశాబ్దాలు దాటి, ఇప్పుడు 44 ఏళ్ల తెలుగువాడి గొంతుకగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సంక్షోభాలు, సవాళ్ల మధ్య కూడా అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
తెలుగుదేశం అంటే తెలుగు ప్రజల గుండె చప్పుడు
మార్చి 29, 1982న హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అన్న ఎన్.టి. రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు. ఆ రోజు నుంచి మన ప్రస్థానం అంచెలంచెలుగా, అడుగడుగునా కొనసాగుతోంది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల అహంకారపు చెరలో తెలుగువారి ఆత్మగౌరవం అవమానాలు ఎదుర్కొంటున్నది చూసి, ఆ తెలుగు పౌరుషం రగిలిపోతుందని భావించి... 1982 మార్చి 29న అన్నగారు ఈ పార్టీని స్థాపించారు.
సినీ జీవితంలోనే కాదు, రాజకీయ జీవితంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించిన మహానాయకుడు స్వర్గీయ ఎన్.టి. రామారావు గారు. "సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు" అని నమ్మి, పేద ప్రజలను దేవుళ్లుగా తలచి సంక్షేమ రాజ్యాన్ని నిర్మించడానికి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి, సామాజిక న్యాయం మరియు నూతన సంస్కరణలకు నాంది పలికారు. యుగానికి ఒక్కరు చరిత్రను సృష్టించేవారు ఉంటారు. అలాంటి వ్యక్తి మన అన్న ఎన్.టి. రామారావు గారే!
"తెలుగు భాషలో మాట్లాడటం నా హక్కు, ఇది నా సంస్కృతి" అని చెప్పి ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరచిపోలేము ప్రజా సంక్షేమ పాలనకు బాటలు వేసి, భారత రాజకీయ చరిత్రలో సంక్షేమ అధ్యాయాన్ని రాసిన పార్టీ తెలుగుదేశం. రూ.2 లక్షకు కిలో బియ్యం, ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, పక్కా ఇళ్లు, పింఛన్లు, భూమిలేనివారికి భూవసతి, పాలపంపిణీ... ఇలా ఎన్నో వినూత్న పథకాలకు దేశంలోనే తొలిసారి శ్రీకారం చుట్టింది మన తెలుగుదేశం పార్టీ.
- చారిత్రాత్మక మండల వ్యవస్థను కూడా ఎన్.టి.ఆర్ గారే ప్రవేశపెట్టారు. ఈ పథకాలు నేడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నాయి- ఇదే మన పార్టీ యొక్క గొప్పతనం. 44 వసంతాల ప్రస్థానంలో ఎన్నో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మన పార్టీ నిర్వహించింది. - అన్న ఎన్.టి.ఆర్ ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అదే దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.
ఎన్.టి.ఆర్ సామాజిక సంస్కరణలు తెచ్చినట్లు, చంద్రబాబు ఆర్థికాభివృద్ధి, విద్యుత్ సంస్కరణలు, టెక్నాలజీ, పాలనా సంస్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. జాతీయ భావాలున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. "కదలి సాగుదాం మనం జన్మభూమికి... రుణం తీర్చడానికి" అంటూ దేశంలోనే ప్రథమంగా ప్రజలను పాలనలో భాగస్వాములను చేసింది మన తెలుగుదేశం పార్టీనే.
- 2014 విభజన తర్వాత నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి పుంజుకునేలా చేయటంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవైపు అభివృద్ధి పథంలో నడుపుతూనే, మరోవైపు ప్రజలకు మెరుగైన సేవలు అందించింది. పోలవరం, ప్రజా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ- ఇవన్నీ మన పార్టీ విధానాలు పేదరికం లేని సమాజ స్థాపనే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలాను అమలు చేస్తున్నాం.
2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సామాజిక పెన్షన్ను రూ.4,000కు పెంచడం, దీపం-2 కింద మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ, యువతకు ఉపాధి - ఇలా ఎన్నో ఘన విజయాలు సాధించాం. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి 'మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్'ను ప్రారంభించాం.
తొలి ఏడాది పాలనలోనే రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగ అవకాశాలను ఆకర్షించాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. రైతులు, యువత, కార్మికులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే మన లక్ష్యం. ఈ లక్ష్యంతోనే చంద్రబాబు గారు పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల ప్రస్థానంలో కార్యకర్తలదే కీలక పాత్ర. ప్రతి విజయం వెనుకా మీ కష్టం, త్యాగం ఉంది.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కొండంత అండ!
తెలుగుదేశం పార్టీ అంతా ఒకే కుటుంబం. ఈ కుటుంబం కులాలు, మతాలకు అతీతం. శిశువును తల్లి కంటికి రెప్పలా కాపాడినట్లు మన పార్టీ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటుంది. ఎన్.టి.ఆర్ మోడల్ స్కూల్, ఎన్.టి.ఆర్ ట్రస్ట్, ఎన్.టి.ఆర్ బ్లడ్ బ్యాంక్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, గ్రీవెన్స్ సెల్ ద్వారా కార్యకర్తలకు అండగా ఉంటున్నాం. కోవిడ్ సమయంలో కూడా ఆక్సిజన్, మందులు, ఆహారం అందించాం.
కార్యకర్తల క్షేమం మన పార్టీకి అత్యంత ముఖ్యం. అందుకే ప్రమాద భీమాను రూ.5 లక్షలకు పెంచాం. సొంత కుటుంబ సంక్షేమం కంటే పార్టీ బలోపేతం కోసం మీరు చేసిన కృషి అపారం. గత సైకో పాలనకు స్వస్తి పలకడంలో మీరు కీలకం. మీ త్యాగ ఫలమే నేడు తెలుగుదేశం జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతోంది. సొంత కుటుంబ సంక్షేమం కంటే పార్టీ బలోపేతం కోసం మీరు చేసిన కృషి అపారం.
గత సైకో పాలనకు స్వస్తి పలకడంలో కార్యకర్తలు కీలకం. ఈ 44 ఏళ్ల ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకొని, ఎన్.టి.ఆర్ - చంద్రబాబు ఆశయ సాధన కోసం అకుంఠితంగా కృషి చేస్తున్న ప్రతి తెలుగువాడికి, ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




