Tadipatri Kidnap Case: తాడిపత్రి కిడ్నాప్ విషాదాంతం.. ఏడేళ్ల బావమరిదిని చంపేసిన కసాయి బావ!

Tadipatri Kidnap Case: అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ల బాలుడి ఉదంతం విషాదంగా ముగిసింది.

Arun Chilukuri
Published on: 26 March 2026 5:09 PM IST
Tadipatri Kidnap Case
X

Tadipatri Kidnap Case: తాడిపత్రి కిడ్నాప్ విషాదాంతం.. ఏడేళ్ల బావమరిదిని చంపేసిన కసాయి బావ!

Tadipatri Kidnap Case: అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ల బాలుడి ఉదంతం విషాదంగా ముగిసింది. సొంత బావయే కాలయముడిగా మారి చిన్నారి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన హేమచంద్ర (7) అనే బాలుడు తన బావ చేతిలోనే బలికావడం అందరినీ కలిచివేస్తోంది.

స్కూల్ నుంచి వస్తుండగా కిడ్నాప్

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం హేమచంద్ర పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వస్తుండగా, నిందితుడు సర్వేష్ (బాలుడి అక్క భర్త) అతడిని కిడ్నాప్ చేశాడు. సాయంత్రం దాటినా బాలుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

డబ్బు కోసమే దారుణం

దర్యాప్తులో భాగంగా బాలుడి బంధువుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, సర్వేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. కేవలం డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. కిడ్నాప్ చేసిన తర్వాత దొరికిపోతాననే భయంతోనో లేదా ఇతర కారణాల వల్లనో పసివాడిని దారుణంగా హత్య చేశాడు.

గ్రామంలో విషాద ఛాయలు

పోలీసుల గాలింపులో హేమచంద్ర నిర్జీవంగా పడి ఉన్న మృతదేహం లభ్యమైంది. అల్లారుముద్దుగా పెరిగిన చిన్నారి శవమై కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నిందితుడు సర్వేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story