Pattikonda: బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్ తరలిస్తే క్రిమినల్ కేసులు!
Pattikonda: పత్తికొండలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు, రికార్డులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లోడ్ వివరాల్లో అక్రమాలు గుర్తించి పంచనామా నిర్వహించారు.
Pattikonda: బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్ తరలిస్తే క్రిమినల్ కేసులు!
Pattikonda: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించబడినవి. ఈ తనిఖీలను పత్తికొండ సిఐ మరియు సి.ఎస్.డి.టి పత్తికొండ ఆధ్వర్యంలో నిర్వహించారు. తనిఖీల సందర్భంగా డొమెస్టిక్ మరియు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పరిశీలించగా,
ఈ రోజు వచ్చిన గ్యాస్ లోడ్‌కు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించలేదని గుర్తించారు. దీనిపై గౌరవ సి.ఎస్.డి పంచనామా నిర్వహించి, నివేదిక తయారు చేయడం జరిగింది. అదనంగా, గ్యాస్ డెలివరీ సిబ్బందికి కఠిన హెచ్చరికలు జారీ చేయబడినవి. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే సిలిండర్లు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు.
ఈ నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఏజెన్సీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




