Srisailam: శ్రీశైలంలో రాములోరి కళ్యాణం భక్తులతో కిక్కిరిసిన క్షేత్రం

Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 2:50 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో రాములోరి కళ్యాణం భక్తులతో కిక్కిరిసిన క్షేత్రం

Srisailam: శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుక వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీరామనవమిని సందర్భంగా దేవస్థానం అనుబంధ ఆలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలోని రామమందిరంలో శ్రీసీతారామల కల్యాణమహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు, శ్రీరామనవమి సందర్భంగా ఉదయం సీతారాములకి, ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించి శ్రీసీతారాముల కల్యాణోత్సవం జరిపించారు ఈ కల్యాణ మహోత్సవంలో ముందుగా లోకసంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం, కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ అనంతరం.

వృద్ధి, అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవచనం,కంకణపూజ, కంకణధారణ, యజ్ఞోపవీతపూజ, యజ్ఞోపవీతధారణ, నూతన వస్త్ర సమర్పణ,వరపూజ, ప్రవర పఠన,గౌరీపూజ,మాంగల్య పూజ,సీతాదేవికి మాంగల్యధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సంప్రదాయ బద్ధంగా సీతారామ కల్యాణం జరిపించారు ఈ కల్యాణోత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు,అధికారులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు కళ్యాణానంతరం భక్తులకు శ్రీస్వామి అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేసారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story