Kukkunur: గ్రామగ్రామాన ఆధ్యాత్మిక శోభ.. కనులపండువగా తలంబ్రాల వేడుక

Kukkunur: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని 18 గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 6:27 PM IST
Kukkunur
X

Kukkunur: గ్రామగ్రామాన ఆధ్యాత్మిక శోభ.. కనులపండువగా తలంబ్రాల వేడుక

Kukkunur: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని కుక్కునూరు, దాచారం, సీతారాంపురం, మారేడుబాక, వింజరం, చీరవల్లి, దామరచర్ల, ఉప్పెరు, రాజీవ్ నగర్, అమరవరం,బంజరగూడెం, ఇబ్రహీంపేట, గణపవరం, అల్లిగూడెం, పెదరాయిగూడెం, వెంకటాపురం, వేలేరు,సీతారామ నగరం గ్రామాలలోని శ్రీ రామాలయాలలో ఈ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో వేదమంత్రాలు,మంగళ వాయిజ్యల నడుమ సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండుగా నిర్వహించారు. గ్రామాల్లో భక్తులు పెద్దఎత్తున రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. దీంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story