Udayagiri: తపాలా కార్యాలయంలో చోరీ.. దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు!

Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి పోస్ట్ ఆఫీస్‌లో అర్ధరాత్రి దొంగతనం. తాళాలు పగలగొట్టి నగదు, రెండు డే స్టాంపులను ఎత్తుకెళ్లిన దుండగులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 7:55 PM IST
Udayagiri
X

Udayagiri: తపాలా కార్యాలయంలో చోరీ.. దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు!

Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని తంతి తపాలా కార్యాలయంలో (పోస్ట్ ఆఫీస్) సంచలన చోరీ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి గుర్తు తెలియని దుండగులు కార్యాలయంలోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది తలుపులు తెరిచి చూడగా లోపల వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో చోరీ జరిగిన విషయం బయటపడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. కార్యాలయంలోని తాళాలు బలవంతంగా పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీలో ఒక పోస్ట్‌మన్‌కు చెందిన ఆర్డీ నగదు సుమారు రూ.7 నుండి 10 వేల వరకు, అలాగే తపాలా శాఖకు సంబంధించిన రెండు డే స్టాంపులు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దుండగుల ఆనవాళ్ల కోసం గాలిస్తున్నారు. ఈ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story