Atmakur: పాణ్యం విజయ్ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన బ్యాంకు!
Atmakur: ఆత్మకూరు విద్యుత్ శాఖ ఉద్యోగి పాణ్యం విజయ్ కుటుంబానికి ఎస్‌బీఐ రూ. కోటి ప్రమాద బీమా అందజేత.
Atmakur: పాణ్యం విజయ్ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన బ్యాంకు!
ఆత్మకూరు: అనంతసాగరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ శాఖ ఉద్యోగి కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొండంత అండగా నిలిచింది. ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన పాణ్యం విజయ్ కుటుంబానికి రూ. 1 కోటి ప్రమాద బీమా చెక్కును బ్యాంక్ అధికారులు అందజేశారు.
అనంతసాగరం మండలం సంజీవనగర్ గ్రామానికి చెందిన పాణ్యం విజయ్ ఆత్మకూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించేవారు. ఇటీవల విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఆయన మరణించారు. విజయ్‌కు ఎస్‌బీఐలో శాలరీ ఖాతా ఉండటం, దానికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించి ఉండటంతో ఈ భారీ మొత్తం లభించింది.
Next Story




