Razole: టీటీడీ వివాదం బి.ఆర్. నాయుడుపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

Razole: టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు వైఖరికి నిరసనగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

PRABHU, RAZOLE
Published on: 4 April 2026 2:36 PM IST
Razole
X

Razole: టీటీడీ వివాదం బి.ఆర్. నాయుడుపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

Razole: రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపి మలికిపురం లోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం లో ఆ దేవ దేవునికి మొరపెట్టుకుంటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజేశ్వరి దేవి మాట్లాడుతూ. తిరుమల పవిత్రతను అగౌరవ పరుస్తు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలపై దాడులు చేయించి తిరిగి వారిపైనే అక్రమ కేసులు పెట్టించడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న బి.ఆర్. నాయుడును వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.

ఆ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారి పవిత్రతను కాపాడాలని స్వామి వారిని ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కర్రి పాపారాయుడు, CEC సభ్యులు K S N రాజు, రాష్ట్ర యువజన విభాగం ప్రధానకార్యదర్శి పాముల ప్రకాష్, నాలుగు మండలాల అధ్యక్షులు అడబాల బ్రహ్మాజీ, కుసుమ చంద్రశేఖర్, బోలిశెట్టి భగవాన్,కట్టా శ్రీనివాస్, మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story