Razole: దళిత కళాకారునిపై దాడి అమానుషం.. అయ్యన్నపాత్రుడు రాజీనామా చేయాలి!

Razole: దళిత డప్పు కళాకారునిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేశారన్న ఆరోపణలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ మాదిగ తీవ్రంగా మండిపడ్డారు.

PRABHU, RAZOLE
Published on: 4 April 2026 7:51 PM IST
Razole
X

Razole: దళిత కళాకారునిపై దాడి అమానుషం.. అయ్యన్నపాత్రుడు రాజీనామా చేయాలి!

Razole: ఒక దళిత (మాదిగ) కులానికి చెందిన పేద డప్పు వాయిద్యకారుని చెంప పై కొట్టి మరలా అతనిపై ఎదురు దాడికి దిగిన ఏపి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీరు చాలా దుర్మార్గమైన, హేయమైన చర్య అని వైకాపా రాష్ట్ర సమాచార విభాగం అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ మాదిగ విమర్శించారు.

రాజోలు లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ. ఆ వాయిద్యకారుడు ఏదో మీ కాలు తొక్కితే అలా చెంప మీద కొట్టినట్లు మీరు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. భారత రాజ్యాంగానికి లోబడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఇలా ఒక దళితునిపై దాడి చేయడం, దానిని కప్పి పుచ్చుకునేందుకు మరో అబద్దం సృష్టించడం, ఆయన వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటన్నారు. వాస్తవానికి ఆ కళాకారునికి మీకు చాలా గ్యాప్ ఉన్నట్లు వీడియో సుస్పష్టంగా కనిపిస్తుంటే ఎందుకు ఇంకా బొంకుతారని ప్రశ్నించారు.

మితిమీరిన గర్వంతో దళిత,బహుజనులు పై దాడులు చేస్తే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరనే అహంకారమా అని ప్రశ్నించారు. దళితులు, బహుజనులు పై దాడులు చేస్తూ ఉంటే చూస్తు ఊరుకునేది లేదన్నారు.ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తున్నామని, తక్షణమే మీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి, యావత్ దళిత జాతికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మిమ్మల్ని పదవి నుంచి తీసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సంఘటన పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం లో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.రిజిష్టర్ పోస్ట్ ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్ కి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story