Pattikonda: గ్రామస్తుల గర్జన.. విండ్ పవర్ భారీ వాహనాల నిలిపివేత!

Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం రామచంద్రాపురంలో గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 4:02 PM IST
Pattikonda
X

Pattikonda: గ్రామస్తుల గర్జన.. విండ్ పవర్ భారీ వాహనాల నిలిపివేత!

Pattikonda: పత్తికొండ మండలం రామచంద్రాపురం గ్రామంలో గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై విండ్ పవర్ కంపెనీకి చెందిన భారీ వాహనాలు రాకపోకలు చేయడంతో రోడ్డు పూర్తిగా గుంతలమయమైందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ నుండి రామచంద్రపురం కి వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతినడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు.

ఈ రోజు విండ్ పవర్ భారీ వాహనాలను ఆపి రోడ్డుపై బయటాయించిన గ్రామస్తులు. రహదారి మరమ్మతులు చేయకుండా వాహనాలు వెళ్లనివ్వమని గ్రామస్తులు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులు, కంపెనీ ప్రతినిధులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీకాంత్, పత్తిపాటి ప్రకాష్, రామకృష్ణ, చంద్రశేఖర్, కన్నప్ప, కృష్ణయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story