Rajanagaram: క్షేత్రస్థాయిలో వైసీపీ బలోపేతం.. గ్రామ కమిటీలతో మాజీ ఎమ్మెల్యే భేటీ

Rajanagaram: రాజానగరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో తిరుగులేని శక్తిగా అవతరించబోతోందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధీమా వ్యక్తం చేశారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 4 April 2026 7:04 PM IST
Rajanagaram
X

Rajanagaram: క్షేత్రస్థాయిలో వైసీపీ బలోపేతం.. గ్రామ కమిటీలతో మాజీ ఎమ్మెల్యే భేటీ

Rajanagaram: గ్రామస్థాయిలో బల మైన శక్తిగా మారనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీరాజకీయచరిత్రలో ఏ పార్టీకి లేనివిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవ ర్గం లో పదివేల మంది భాగ స్వామ్యంతో పటిష్టమైన గ్రామకమిటీలను ఏర్పాటు చేసుకుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ జన విభాగం అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మె ల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు.రాజానగరం మండలం పల్ల కడియం, పరిజల్లిపేట, రామస్వామిపేట, మల్లం పూడి, పాత తుంగపాడు, కొత్త తుంగపాడు,తోకాడ గ్రామాల్లో ఏర్పాటైన గ్రామ కమిటీలతో రాజా సమా వేశం అయ్యారు.

ఈ సందర్భంగా శనివారం ఆయా గ్రామాల్లో కమిటీ లతో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు.వైఎస్ఆర్సిపి అన్ని విభాగా లకు గ్రామ కమిటీలను నియమించు కోవడం ద్వారా పార్టీ క్షేత్రస్థాయిలో బలమైన శక్తిగా మారుతుంద న్నారు. భవిష్యత్తులో కమిటీల వారీగా చేపట్టాల్సిన కార్య క్రమాలు ,విధులు బాధ్యత లు గురించి రాజా వివరిం చారు. పార్టీ పట్ల విధేయత, నిబద్ధ త తో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త కష్టాన్ని గుర్తిస్తాన న్నారు.

రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన, ప్రజా సమ స్యల పైన దృష్టి చారిం చాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజ లకు ఇచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కి పబ్బం గడుపుతుందో ప్రజ లకు వివరించాల్సిన అవ సరం ప్రతి కార్యకర్త పైన ఉందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్క టి అమలు చేయలేదన్నా రు. రెండేళ్ల పాలనలో ప్రభు త్వం ఏ విధంగా విఫలమైం దనేది ప్రజలకు వివరించా లని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు, అరాచకాలపై పోరాటం సాగించాల్సిన సమయం ఆసన్నమైంద న్నారు. అందుకు గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్త సంసిద్ధులు కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కమిటీ లు వారిగా చేపట్టా ల్సిన కార్యచరణ పై చర్చిం చారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story