Rajam: శంకుస్థాపన జరిగింది.. కానీ రోడ్డు పడలేదు!
Rajam: రాజాం - ఇజ్జిపేట రోడ్డు పనుల్లో తీవ్ర జాప్యం. రూ. 1.95 కోట్లతో ఎమ్మెల్యే కోండ్రు మురళి శంకుస్థాపన చేసినా, కేవలం రూ. 50 లక్షల పనులతోనే నిలిచిపోయిన వైనం.
Rajam: శంకుస్థాపన జరిగింది.. కానీ రోడ్డు పడలేదు!
Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం: స్థానిక శ్రీకాకుళం రోడ్డు నుంచి ఇజ్జిపేట గ్రామానికి సుమారు రూ.1.95 కోట్ల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. అయితే శంకుస్థాపన జరిగి చాలాకాలం గడిచినా ఇప్పటివరకు కేవలం రూ.50 లక్షల విలువైన పనులు మాత్రమే చేపట్టి మిగతా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
దీంతో ఇజ్జిపేట గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజాం నుంచి ఇజ్జి పేట వెళ్లే ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి నిధులు విడుదల చేసి త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేసి గ్రామస్తులకు ఉపశమనం కల్పించాలని వారు కోరుతున్నారు
Next Story




