Rajahmundry: నా కుమారుడి మరణానికి వారే కారణం.. ఎస్పీకి ఫిర్యాదు

Rajahmundry: రాజమహేంద్రవరంలో మొబైల్ వ్యాపారి నారాయణ లాల్ ఆత్మహత్య కలకలం రేపింది.

NARAYANA, RAJANAGARAM
Published on: 6 April 2026 8:22 PM IST
Rajahmundry
X

Rajahmundry: నా కుమారుడి మరణానికి వారే కారణం.. ఎస్పీకి ఫిర్యాదు

Rajahmundry: తన కుమారుడిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన యువకుడి తండ్రి రాజస్థాన్ రాష్ట్రం ,ఉగమ్మా వాస్ గ్రామానికి చెందిన కాలు రామ్, అతని సోదరుడు పెదనాన్న అశోక్ కుమార్,

సోదరుడు రాజ్ మాలి తదితరులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ఎస్పీ డి నరసింహ కిషోర్ కు వారు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలు రామ్, అతని సోదరుడు పెదనాన్న అశోక్ కుమార్ లు మాట్లాడుతూ కుమారుడు నారాయణ లాల్ జీవనోపాధి నిమిత్తం నాలుగు సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుండి రాజమహేంద్రవరం నగరానికి వచ్చాడని తెలిపారు. మొబైల్ రిపేర్ పనులు నేర్చుకొని, మే, 2025 న జై భవాని మొబైల్స్" అనే పేరుతో గీతా అప్పర థియేటర్ ఎదురు, మెదరపేట లో, వ్యాపారాన్ని ప్రారంభించాడని వివరించారు.

రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ రాజమహేంద్రవరం హోల్ సేల్ అండ్ రిటైల్ మొబైల్ అసోసియేషన్ మధ్య సభ్యుల సంక్షేమం, పరస్పర సహకారం కోసం కుదిరిన ఎం ఓ యు ను నిందితులు దుర్వినియోగం చేసి, చట్ట విరుద్ధంగా నా కుమారుడి వ్యాపారం పై బ్యాన్ విధించి, జరిమానాలు విధించి, అతన్ని వేధించి, మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నా కుమారుడు మానసిక క్షోభకు గురై వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. తన కుమారుడు ప్రారంభంలో అప్పటి ఆర్డబ్ల్యూఆర్ఎంఏ జుయింట్ సెక్రటరీ ఇంద్రకుమార్ వద్ద సుమారు 21 సంవత్సరాలు పనిచేశాడని తెలిపారు.

అనంతరం తనకు తానుగా నూతన వ్యాపారం ప్రారంభించాడని అన్నారు. తన కుమారుడి పై ఇంద్రకుమార్, అతని సోదరుడు అర్జున్ కుమార్ (స్వావరియా మొబైల్స్, రాంబా ఊర్వశి మేనక థియేటర్ సమీపం) అసూయ, ద్వేషంతో నా కుమారుడిపై కక్ష పెంచుకొని వేధింపులకు గురి చేశారని వివరించారు. ఇంద్రకుమార్, అర్జున్ కుమార్, డామ్రారామ్ అనే వ్యక్తి, ఇతర సభ్యులు, యస్. హేమంత్, ఖాళేశా సహకారంతో నా కుమారుడి అంతు చూస్తామని బెదిరించారని అన్నారు.

ఈ వ్యవహారంలో ఇంద్రకుమార్, అర్జున్ కుమార్, అర్జున్ పటేల్ ,బి. వేణుగోపాల్, ఎం.డి. ఖలీల్ ,ఎస్. హేమంత్, కాళేశా, డామ్రారం తదితరులు కలిసి కుట్రపూర్వకంగా నా కుమారుడి షాపుపై అక్రమంగా బ్యాన్ విధించి ఎవరైనా "జై భవాని మొబైల్స్" తో వ్యాపారం చేస్తే మొదటిసారి రూ.5వేలు , తదుపరి రూ.10వేలు జరిమానా ప్రకటించి వేధింపులకు గురి చేశారని అన్నారు. నా కుమారుడు నారాయణ లాల్ ఆత్మహత్యకు కారకులయిన కలేపా, గోపాల్, హేమంత్, డామ్రారామ్, పైన చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో విక్రమ్ వైష్ణవ్, జేతారాం, లక్ష్మీ కుమార్, రన్ బో డారామ్, జయంతి లాల్, ప్రకాష్ కుమార్ గోపిలాల్, కేతారాం తదితరులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story