Gokavaram: రైతులకు వరం.. నవధాన్యాల విత్తన కిట్లు!

Gokavaram: గోకవరం మండలంలోని రైతులకు ప్రకృతి వ్యవసాయం కోసం నవధాన్యాల విత్తన కిట్లు అందుబాటులోకి వచ్చాయి.

NARAYANA, RAJANAGARAM
Published on: 6 April 2026 8:29 PM IST
Gokavaram
X

Gokavaram: రైతులకు వరం.. నవధాన్యాల విత్తన కిట్లు!

Gokavaram: గోకవరం మండలం వెదురుపాక క్లస్టర్ పెంటపల్లి గ్రామ పరిధిలో గల శ్రీ లక్ష్మి నరసింహ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం గండి శ్రీను ఆధ్వర్యంలో యూనిట్ గ్రామాలకు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రానున్న ఖరీఫ్ సాగుకు నవధాన్యాలు కిట్లు తయారీ చేపట్టారు రైతులకు పెంటపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంలో రైతులకు నవధాన్యాలు కిట్లు అందుబాటులో ఉంచారు, అంతేకాకుండా గోకవరం మండలం ప్రకృతి వ్యవసాయ మోడల్ మండలంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులుకు అందుబాటులో ఉంటూ సేంద్రియ వ్యవసాయానికి సలహాలు సూచనలతో పనిచేస్తూ మండలంలో 7 క్లస్టర్లలో 14 గ్రామపంచాయతీలలో నవధాన్యాలు కిట్లు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

నవధాన్యాలు తయారీ ఏర్పాట్లను సందర్శించిన ఏడి శ్రీనివాసరావు మాట్లాడుతూ యూరియా డి ఏ పి పొటాష్ ఎరువులలో పోషకాలు శాతం తక్కువ ఉంటుందని అదే పిఎండిఎస్ విత్తనాలు వేయడం వలన భూమికి అన్ని రకాల ముఖ్య స్థూల సూక్ష్మ పోషకాలాన్ని సమపాళ్లలో అందుతాయని తర్వాత వేసుకునే పంటకు ఎరువులు పురుగు మందులు వాడకం తగ్గుతుందని అలాగే కలుపు నివారణ పశుగ్రాసంగా ఉపయోగపడుతుందని అందరూ కూడా ఈ పిఎండిఎస్ విత్తనాలు వేసుకోవాలని ముఖ్యంగా చిన్న సన్న కారు రైతులు మరియు కౌలు రైతులు తప్పనిసరిగా తమ పొలాలలో నవధాన్యాలు విత్తనాలు వేసుకోవాలని ప్రతి రైతు కూడా నవధాన్యాలు కిట్లు వేసుకునే విధంగా ఆర్ఎస్కే సిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించాలని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఎన్ఎఫ్ఏ కృపావతి, ఎమ్టి యల్ బసవన్నగౌడ్, ఎఫ్ ఎమ్ ఎమ్టి ఎల్. దేవి, వి ఏ ఏ లు, ఐసిఆర్పి లు, రైతులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story