Nellore: పరిశుద్ధ వారం ప్రారంభం.. నెల్లూరులో ఘనంగా పామ్ సండే వేడుకలు
Nellore: నెల్లూరు వేదాయపాళెంలోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్‌లో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి.
Nellore: పరిశుద్ధ వారం ప్రారంభం.. నెల్లూరులో ఘనంగా పామ్ సండే వేడుకలు
Nellore: ప్రపంచవ్యాప్తంగా జరిగిన మట్టల ఆదివారం (Palm Sunday) సెలబ్రేషన్స్ లో భాగంగా నెల్లూరు వేదాయపాళెం లోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. మట్టల ఆదివారం నాడు యెరూషలేము లోనికి అడుగుపెట్టిన యేసు ప్రభువు, ఈరోజు నీ హృదయం అనబడే ఆలయంలోనికి రావాలని కోరుకుంటున్నాడని ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, నీ జీవితంలో ఒక గొప్ప మార్పునకు ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పారు సిస్టర్ యునిస్.
మట్టల ఆదివారం నాడు మన జీవితాలను ఒకసారి నిశితంగా పరీక్షించుకోవాలని ఆ రోజు యెరూషలేములో ఉన్న ఆ నాలుగు రకాల గుంపులలో మనం ఎక్కడ ఉన్నాం? కేవలం గుంపును చూసి ఆవేశపడే వారంగా ఉన్నామా? లాభం కోసం వెంబడిస్తున్నామా? లేక దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపిస్తూ, మన హృదయాలను ఆయనకు సింహాసనంగా అర్పిస్తున్నామా? పరిశీలించుకోవాలని చెప్పారు.. మన పరిస్థితిని పూర్తిగా ఎరిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యానికి విధేయత చూపడం నేర్చుకుందాం. ఆయన వాక్యానికి తలవంచి, మన జీవితాలను ఆయన చేతుల్లో పెడదాం అని బోధించారు..
నాడు యెరూషలేము వీధుల్లో మట్టలు పట్టుకొని పాడిన "హోసన్నా" అన్న నినాదాలు ఈరోజు మన హృదయాల్లో ప్రతిధ్వనించాలని....క్రీస్తును కేవలం మన పెదవులతో మాత్రమే కాకుండా, మన నిజ జీవితంలో ఆయనకు లోబడి జీవిస్తూ ఆరాధించాలని చెప్పారు. ఈ పవిత్ర వారంలో (Passion week), ఆయన మనకోసం చేసిన సిలువ యాగమును ధ్యానిస్తూ, రారాజుగా ఆయనకు మన హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుదాం అని తెలిపారు.. ఆ దేవాది దేవుడు మనకు తండ్రిగా ఉండడం మన అదృష్టమని, అందుకు మనం అర్హులము కానప్పటికిని.. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను" అను వాక్యమును బట్టి దేవుని ప్రేమను బట్టి... ఆయన కుమారుడైన యేసు ప్రభువును మన కొరకు ఈ లోకానికి పంపించాడని, తన ప్రాణమునే మన కొరకు అర్పించి తిరిగి లేచాడని చెప్పారు...ఆయన మాటకు లోబడి మనం జీవిస్తే చాలునని, ప్రపంచమంతా శాంతి నెలకొంటుందని చెప్పారు సిస్టర్ యునిస్.




