మా రాముడు జోలికి వచ్చిన.. రఘురామ కృష్ణంరాజు జోలికి వచ్చిన ఖండిస్తాం
Palakoderu: ఆకివీడు పెదపేటలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై జరిగిన దాడి యత్నాన్ని పాలకోడేరు కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు.
మా రాముడు జోలికి వచ్చిన.. రఘురామ కృష్ణంరాజు జోలికి వచ్చిన ఖండిస్తాం
Palakoderu: ఉండి పెద్ద పేటలో జరిగిన సంఘటన ప్రతి హిందువు ఖండించాలని పాలకోడేరు కూటమి నాయకులు అన్నారు. శనివారం నాడు పాలకోడేరు గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రఘురామ కృష్ణంరాజు చేస్తున్నారని కొనియాడారు. పురాతన చరిత్ర కలిగిన దేవాలయాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో రఘురామ కృష్ణంరాజు ఆకివీడు పెదపేట పర్యటన చేశారని
పర్యటన చేసిన నాటి నుంచి ఉద్దేశపూర్వకంగానే కొంతమంది క్రైస్తవులు మతాల పేరుతో విభేదాలు సృష్టించాలని శ్రీరామనవమి రోజు రఘురామ కృష్ణంరాజు పైన కూటమి నాయకుల పైన దాడికి యత్నం చేశారని అన్నారు. హిందువులమని చెబుతూ హిందువుల పైన దాడి చేయడం దారుణం అన్నారు. హిందువుల ముసుగులో క్రిస్టియన్స్ ఈ దాడికి వడిగట్టారని విమర్శించారు. ప్రశాంతమైన ఉండి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు ఇటువంటి దాడులు జరగలేదని గుర్తు చేశారు. రఘురామకృష్ణంరాజుకు అండగా తమంట ఎప్పుడు ఉంటామని తెలిపారు. హిందువుల జోలికి వస్తే ఎవరిని సహించేది లేదని హెచ్చరించారు.




