Nellore: వసతి గృహాల్లో మెనూ పక్కాగా ఉండాలి!

Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాల బాలికల వసతి గృహాలను సోషల్ వెల్ఫేర్ డీడీ కె. శోభారాణి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 4:42 PM IST
Nellore
X

Nellore: వసతి గృహాల్లో మెనూ పక్కాగా ఉండాలి!

Nellore: మండల కేంద్రమైన మర్రిపాడులో గల ప్రభుత్వ బాల బాలికల వసతి గృహాలను నెల్లూరు సోషల్ వెల్పేర్ డీడీ కె. శోభారాణి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని ఆమె స్వయంగా పరిశీలించి ఆమె చేతుల మీదుగా విద్యార్థులకు

వడ్డించారు. వసతి గృహాల్లో అవకతవకలకు తావు లేకుండా మెనూ సక్రమంగా అమలు చేయాలని ఆమె సూచించారు. 10వ తరగతి వసతి గృహం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని ఆమె పేర్కొన్నారు. అలాగే వసతి గృహాలను సంక్షేమ అధికారులు పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేశారు.పరీక్షా సమయంలో విద్యార్థులకు మంచి సూచనలు, సలహాలు ఇస్తూ 100శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా వసతి గృహాల సంక్షేమ అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ తనిఖీల్లో వార్దన్లు మహమ్మద్ ఆలీ, కె. సూర్య కుమారి పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story