Nellore: జీతాలు పెంచండి.. జీవితాలు చక్కదిద్దండి

Nellore: నెల్లూరు కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు భారీ ధర్నా చేపట్టారు. ఏడు ఏళ్లుగా పెరగని జీతాలు, సమ్మె కాలపు వేతనాలు డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 6:36 PM IST
Nellore
X

Nellore: జీతాలు పెంచండి.. జీవితాలు చక్కదిద్దండి

Nellore: మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని ,సమ్మె కాలపు వేతనాలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు సిఐటీయు నాయకులు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని, గత సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, 14 రోజుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో విఆర్సి గ్రౌండ్ నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కే. పెంచల నరసయ్య, జిల్లా కార్యదర్శి ఆర్ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి ఏడు సంవత్సరాలు కావస్తున్నదని, ఈ కాలంలో నిత్యవసర వస్తువుల సరుకుల ధరలు అమాంతం పెరిగాయని తెలిపారు. ఫలితంగా మున్సిపల్ కార్మికులు అప్పుల బారిన పడుతున్నారని, రిటైర్ అయినటువంటి కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా, అర్ధాంతరంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించే దాంట్లో కూడా తీవ్ర జాప్యం జరుగుతున్నదని చెప్పారు. ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, సమాన పనికి, సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. గత 14 రోజుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన ఇంతవరకు కార్పొరేషన్ అధికారులు స్పందించలేదని తెలిపారు. 12వ పి.ఆర్.సిని వెంటనే ప్రకటించి ,మున్సిపల్ కార్మికుల జీతాలు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు .ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు .అనంతరం జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ అధ్యక్షులు ఎం. సుధాకర్ ,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వజ్రమ్మ, నాయకులు మనోజ్ ,సుజాతమ్మ ,శ్రీనివాసులు, కామాక్షమ్మ, కొండమ్మ, రమాదేవి, భాగ్యమ్మ,లోకేష్, బుజ్జమ్మ చెన్నయ్య,మాల కొండయ, భారతి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story