Nellore: రైతు కంట కన్నీరు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విసుర్లు!

Nellore: నెల్లూరు జిల్లాలో వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

Arun Chilukuri
Updated on: 28 March 2026 2:27 PM IST
Nellore
X

Nellore: రైతు కంట కన్నీరు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విసుర్లు!

Nellore: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది నెల్లూరు జిల్లా రైతుల పరిస్థితి...జిల్లాలో వరి కోతలు మొదలై, ధాన్యం చేతికొస్తున్న వేళ, సరైన గిట్టుబాటు ధర లేక, దిక్కుతోచని స్థితిలో ఉంటుంటే. దళారులు, వ్యాపారుల అక్రమాలు ఓవైపు ఇబ్బందులు పెడుతున్నారంటూ.

గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయం, స్వామి దాస్ స్కూల్ దగ్గర నుండి , పుండరీ కాక్షయ్య స్ట్రీట్, రాంజీ నగర్, మీదుగా నిరసన కార్యక్రమం కొనసాగించారు.

అనంతరం పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కి వినతిపత్రం సమర్పించారు వైసీపీ నేతలు..

ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైతులు మోసపోతున్నారని. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక రైతులు మరింత అప్పుల్లోకి కూరుకుపోతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని ప్రభుత్వం పై నమ్మకంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరికిందని గుర్తు చేశారు. రైతు బాగోగులు ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు....ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరియు నెల్లూరు సిటీ ఇంచార్జ్ శ్రీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , నెల్లూరు రూరల్ ఇంచార్జ్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నర్సింహారెడ్డి, తదితర వైసిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story