Nellore: కార్పొరేషన్‌లో క్లీన్ స్వీప్ వ్యూహం.. నెల్లూరు పాలిటిక్స్‌లో హీట్

Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఊపందుకుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 10:22 PM IST
Nellore
X

Nellore: కార్పొరేషన్‌లో క్లీన్ స్వీప్ వ్యూహం.. నెల్లూరు పాలిటిక్స్‌లో హీట్

Nellore: నెల్లూరు కార్పొరేషన్ లో క్వీన్ స్వీప్ కొట్టేందుకు ఓ ముగ్గురు నేతల మంతనాలు జరిపారు.. నెల్లూరు కార్పొరేషన్ ఇక 72 డివిజన్ లు కానుండడంతో. నెల్లూరు సిటీ 36 నెల్లూరు రూరల్ 36 ప్రాంతాల పునర్విభజనపై జోరుగా ముఖ్య నేతల చర్చలు జరిపారు. ఏ ప్రాంతం ఏ డివిజన్లోకి వెళుతుందోనని ఉత్కంఠ భరితంగా ఉన్న నేపథ్యంలో. నెల్లూరు నగర కార్పొరేషన్ 72 డివిజన్లుగా మారనుంది.

ఈ మేరకు అన్ని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు నెల్లూరు నగర కార్పొరేషన్ లో 54 డివిజన్ లు ఉండగా, అదనంగా 18 డివిజన్లు చేరనున్నాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 36 నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో 36 డివిజన్లు ఏర్పడనున్నాయి.

దీనికి సంబంధించి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లు నారాయణ క్యాంపు కార్యాలయంలోసుదీర్ఘ చర్చలు జరిపారు. ఏ ప్రాంతం ఏ డివిజన్ లో కలిసినా తమకు అనుకూలంగా వుండేలా అంతు చిక్కని వ్యూహం పన్నతున్నారని తెలుస్తోంది.

నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్ లు ఇప్పటివరకు పలు ప్రాంతాలు ఉన్నాయి. పునర్విభజనతో ఏ ప్రాంతం ఏ డివిజన్లో కలుస్తుందో అనేది అంతుచిక్కని వ్యూహంగా తయారైంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ పునర్విభజనకు సంబంధించి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కొన్ని ప్రాంతాలను పాత డివిజన్ల నుంచి తీసివేసి కొత్త డివిజన్ లలో కలిపేలా నిర్ణయించారు.

గెలుపు లెక్కలు, రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా కొత్త డివిజన్లు ఉండబోతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నా, నెల్లూరు నగరానికి సంబంధించి కొన్ని డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా పోటీ ఏర్పడి ఉంది. వైసిపి బలంగా ఉన్న ప్రాంతాలు ఏ ప్రాంతం ఏ డివిజన్ లో కలిపితే లాభదాయకంగా ఉంటుందనే అంశాలను చర్చించారు.

మొత్తానికి సుమారు 70 డివిజన్లకు సంబంధించి ముగ్గురు మధ్య ఏకాభిప్రాయం ఏర్పడినట్లు విశ్వసినియ వర్గాల సమాచారం. 41 వ డివిజన్ ప్రాంతాలతో పాటు, నెల్లూరు రూరల్ , టౌన్ సరిహద్దులకు సంబంధించి మరికాస్త చర్చ జరగాల్సి ఉంది. మొత్తానికి నెల్లూరు నగర కార్పొరేషన్ లో వార్డుల పునర్విభజన రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story