Nellore: మా బడికి రండి - నాణ్యమైన విద్యను పొందండి
Nellore: నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు వినూత్న ప్రచారం చేపట్టారు.
Nellore: మా బడికి రండి - నాణ్యమైన విద్యను పొందండి
Nellore: కార్పొరేట్ స్కూల్స్ నడుమ ప్రభుత్వ పాఠశాలలు పిల్లలతో కళకళలాడుతూ వుండాలంటే. ప్రైవేట్ బడులకంటే ప్రభుత్వ పాఠశాలలు ఏమాత్రం తీసిపోవనే నమ్మకాన్ని తల్లిదండ్రులకు, పిల్లలకు కల్పించాల్సిన బాధ్యత తామే తీసుకున్నారు, నెల్లూరు చింతా రెడ్డిపాలెం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు.
"మా బడిలో చేర్పించండి - నాణ్యమైన విద్యను అందిస్తాం" అనే హామీ ఇస్తూ. మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, చింతారెడ్డిపాలెం ప్రధానోపాధ్యాయులు మణికందరచారి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కె విజయలక్ష్మి, ఎ. సుధాగోపాలరావు, యం.ఇందుమతి,మేడా ప్రసన్నలక్ష్మీ, అన్నం వెంకటేశ్వర్లు, శ్రీధర్ రెడ్డి, నీరుకట్టు ఈశ్వరయ్య, అన్నం శ్రీనివాసులు కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామంలోని తల్లిదండ్రులను కలసి విద్యార్థులను చేర్పించవలసినదిగా కోరుతూ.
సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ చదువుకోవడమే తమ లక్ష్యం అంటూ ప్రతి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అనుకూలంగా ఎన్నో పథకాలను అందుబాటులోకి తెస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్న సమయంలో. ఉపాధ్యాయులే తల్లిదండ్రులకు, పిల్లలకు ఓ నమ్మకాన్ని కల్పించడానికి ఇలా ముందుకు రావడం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.
ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం ,బుక్స్, బ్యాగ్స్, స్కూల్ యూనిఫార్మ్, పలు రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని, దానిపట్ల అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల వైపు పసిపిల్లలను బడి పిల్లలుగా అడుగులు వేయించాలనే లక్ష్యంతో చేపట్టిన , ఈ వినూత్న కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంటుంది.




